Monday, December 23, 2024

గ్రామంపై మిలిటెంట్ల దాడి.. నిద్రిస్తున్న ముగ్గురి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ముగ్గురి దారుణ హత్య జరిగింది. మైతీలు ఎక్కువగా ఉండే క్వాక్టా గ్రామంపై సాయుధులు అర్థరాత్రి తరువాత విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. బిష్ణూపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారిలో తండ్రికొడుకులు కూడా ఉన్నారు. జిల్లాలోని క్వాక్టాలో నిద్రిస్తున్న వీరిపై మిలిటెంట్లు కాల్పులు జరిపి హతమార్చారు. తరువాత వీరిని కత్తులతో చీల్చేశారని శనివారం ఉదయం పోలీసులు తెలిపారు.

మిలిటెంట్లు చురచంద్‌పూర్ నుంచి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డట్లు వెల్లడైంది. ఘర్షణ మణిపూర్‌లో క్వాక్టా ప్రాంతీయులు ఇంతకాలం ఇళ్ల నుంచి పారిపోయి , సహాయక శిబిరాలలో తలదాచుకుంటూ వచ్చారు. ఇటీవలే పరిస్థితి సద్ధుమణిగిందని తమ ఇళ్లకు వచ్చారు. సొంత ఇంట్లో సేదదీరుతున్న వీరిని మిలిటెంట్లు కక్షతో పొట్టనపెట్టుకున్నారు.ఈ ఘటనపై స్థానికుల తీవ్రస్థాయిలో ఆగ్రహించి చురచంద్‌పూర్ వైపు వెళ్లేందుకు, మిలిటెంట్ల పనిపెట్టేందుకు ముందుకు సాగారు. దీనిని గుర్తించి ఈ గుంపును దారిలోనే భద్రతా బలగాలు నిలిపివేశాయి.

ఈ దశలో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మిలిటెంట్లను ఏరివేసేందుకు భద్రతా బలగాలు ముందుకు సాగిన దశలో ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మిలిటెంట్లకు, రాష్ట్ర పోలీసు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ దశలో ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. పోలీసు ముఖంపై గాజుముక్కలతో ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఈ ప్రాంతంలో ఘటనలతో ఉభయ ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫూ సడలింపుల సమయాలను కుదించారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News