Tuesday, December 24, 2024

తీస్తా వరదలు.. అపాయం నుంచి బయటపడ్డ 150 మంది కార్మికులు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : సిక్కిం పశ్చిమబెంగాల్ సరిహద్దులో రైల్వే సొరంగ నిర్మాణం లోని దాదాపు 150 మంది కార్మికులు ముందస్తు హెచ్చరిక వల్ల తీస్తానది వరదల ప్రమాదం నుంచి బయటపడ గలిగారు. వరద ప్రమాదం వస్తుందని తెలుసుకున్న ఆ నిర్మాణ కంపెనీ అధికారులు వెంటనే నిర్మాణ ప్రదేశం లోని కార్మికుల కాలనీ వద్దకు వెళ్లారు. నిద్రలో ఉన్న కార్మికులను పదేపదే ఫోన్‌కాల్స్ ద్వారా అప్రమత్తం చేశారు. వెంటనే అత్యవసరమైనవి బ్యాగుల్లో సర్దుకుని నదిపక్కన ఉన్న శిబిరం నుంచి వెళ్లి పోవాలని హెచ్చరించారు. సెక్యూరిటీ గార్డును కూడా ఆ కార్మికుల వద్దకు పంపారు. వేరే రూటులో సమీపాన గల రోడ్డుకు 20 నిమిషాల్లో కార్మికులు చేరుకోగలిగారు. రోడ్డుకు చేరుకున్న తరువాత వెనక్కు తిరిగి చూస్తే వరద నీటి ఉధృతికి వారి శిబిరం కొట్టుకు పోవడం కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News