Monday, December 23, 2024

కుప్పకూలిన సైనిక హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో చీతా సైనిక హెలికాప్టర్ కూలిన ఘటన లో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఈ సంఘటన గురువారం ఉద యం వెస్ట్ కామెంగ్ జిల్లాలోని మందాలా వద్ద జరిగిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. హెలికాప్టర్ వాతావరణ ప్రతికూలతల నడుమ అ సోంలోని సొంటిపూర్ జిల్లా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వ స్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన పైలట్లను లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి, ఆయన కో పైలట్ మేజర్ జయంత్‌గా గుర్తించినట్లు రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ వివరించారు. మృతి చెందిన వివిబి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని బొమ్మల రామారం గ్రామానికి చెందిన ఉప్పల వినయ్ భాస్కర్ రెడ్డిగా గుర్తించారు.

37 సంవత్సరాల రెడ్డి తండ్రి ఉప్పల నరసింహారెడ్డి గాజుల రామారం రెడ్డి సంఘం అధ్యక్షులుగా, లైన్స్‌క్లబ్ ప్రతినిధిగా ఉన్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలతో ఉదయం 9.15 గంటలకు హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు వ్యవస్థతో సంబంధాలు లేకుండాపోయింది. వెంటనే ఐదు గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, ఎస్‌ఎస్‌బి, ఐటిబిపి బృందాలు వెంటనే జరిపిన అన్వేషణలో మండాలాకు తూర్పున బంగ్లాజాప్ గ్రామం వద్ద హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ ప్రాంతం అంతా దట్టమైన పొగమంచుతో నిండి ఉండగా ఏదీ కన్పించని స్థితిలో , మొబైల్ ఫోన్లు కూడా పనిచేయని దశలో తలెత్తిన పరిస్థితిలో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News