తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం.
నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి 3 వేల రూపాయల ప్రోత్సాహకం
ఆరోగ్య సేవల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానం
మదర్ మెర్టాలిటీ రేటు తగ్గించడంలో తమిళనాడును అధిగమించాం.
హైదరాబాద్: తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదని అమృతంతో సమానమని దీన్ని మరి దేంతో పోల్చలేమని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పాల వారోత్సవాల్లో హరీష్ రావు పాల్గొన్నారు.
పెట్ల బురుజులో తల్లి పాల బ్యాంక్ ప్రారంబించారు. తల్లి పాలు దొరకని వారికి ఇది ఉపయోగపడుతోందన్నారు. ఎన్.ఎస్. యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. ఆగష్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్ వో తల్లి పాల వారోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఎ.ఎన్. సి చెకప్ కు వచ్చినప్పటి నుంచి తల్లి పాల శ్రేష్టత తెలిపేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు.
ప్రపంచంలో 88 శాతం మంది తల్లులు ఆరు నెలల పాటు తమ పిల్లలకు పాలు ఇచ్చే దేశం బంగ్లాదేశ్. గ్రీన్ నేషన్ గా బంగ్లాదేశ్ ను డబ్ల్యూహెచ్ వో గుర్తించింది. మన దేశంలో కూడా ఇస్తున్నారు. కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు. 64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారు.
తొలి గంటలో బిడ్డకు ఇచ్చే పాలు టీకాలతో సమానమని, ప్రతీ తల్లీ గమనించాలని హరీష్ రావు సూచించారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారని, సి సెక్షన్ ఆపరేషన్లతోనే ఇది జరుగుతోందని, తల్లి పాలు ముద్దు- డబ్బా పాలు వద్దు అన్న నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. డాక్టర్లే ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు. మరి కొద్ది మంది గర్బిణీ స్త్రీల కుటుంబ సభ్యులు- మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ప్రాణాపాయం బట్టి ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. గర్భిణీ స్త్రీలకు కొంత ఫిజికల్ ఎక్సైర్ సైజ్ చేయాల్సి ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల వారు కార్పోరేట్ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీ కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైన ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారని, మనమేమో లక్షలు ఖర్చు పెట్టి కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి సి- సెక్షన్ ఆపరేషన్లు చేయించుకుంటున్నామన్నారు.
నార్మల్ డెలివరీల వల్ల కలిగే లాభాలను యూరోపియన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారు గుర్తించారని, తల్లికి, శిశువుకు నార్మల్ డెలివరీ వల్ల క్షేమంగా ఉంటారని, మొదటి గంటలో తల్లి పాలు, ఆరు నెలల పాటు అందడం వల్ల శిశు మరణాల రేటు 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయన్నారు. శిశు మరణాలు తగ్గాలంటే తల్లి పాలు మొదటి గంటలో అందాలని, ఆరు నెలల పాటు నిరంతరాయంగా అందాలని, ఇవి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్ లు గ్రామ గ్రామాన తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యత వివరిస్తున్నామన్నారు.
తెలంగాణరాక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం కాన్పులు మాత్రమే అయ్యేవని, ఇప్పుడు 61 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని హరీష్ రావు ప్రశంసించారు. ఇది గతంతో పోల్చితే రెట్టింపు అయిందని, ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పెంచామన్నారు.
శానిటేషన్ చార్జీలు పెంచామని, ఒక మంచానికి నెలకు 5 వేల రూపాయల నుంచి 7500 రూపాయలకు శానిటేషన్ ఖర్చు చేస్తున్నామని శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచామని, ఈ నెల నుంచి మీకు అవి అందుతామన్నారు. ఈఎస్ఐతో పాటు పిఎఫ్ ఉంటుందన్నారు. శానిటేషన్ సిబ్బందిపై ఏదైనా ఆరోపణలు వస్తే, సూపరిండెంట్లు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇస్తున్నామని, డబ్బులు రోగులను అడిగినట్లు తెలిస్తే ఇంటికి పంపడమే ఉంటుందని, దీనిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, తాను ఆకస్మిక తనిఖీలు చేపడుతామని, అధికారులు తనిఖీ చేస్తారన్నారు.
అవసరమైన స్కానింగ్ లన్నీ ఇక్కడే చేయాలని బయటకు పంపవద్దని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామని, ఒక్క రోగి బయటకు వెళ్లవద్దని మందులు కోసం బయట మెడికల్ షాపులకు వెళ్లొద్దని హరీష్ రావు సూచించారు.
న్యూ బోర్న్ బేబీకి అవసరమైన చికిత్స, మందులు అందుబాటులోకి తెచ్చామని, నిధులకు కొరత లేదని, నమ్మకాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్రయత్నం చేద్దామని, బెడ్ల సంఖ్యను పెంచాలని అడిగారని, స్టాఫ్, మందులు ఏవి కావాలో సమీక్ష జరిపి చెప్పానని అవన్నీ ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు.