Wednesday, January 22, 2025

ఉత్తర్ ప్రదేశ్‎‎లో ఘోర ప్రమాదం: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఫతేపూర్: ఉత్తర్ ప్రదేశ్ లో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పతేపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన పాల ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది స్పాట్ లోనే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాన్పూర్‌ ఘతంపూర్‌కు చెందిన 11 మంది వ్యక్తులు ఆటోలో జెహనాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరినట్లు సమాచారం. అతివేగం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News