Thursday, January 23, 2025

కరెంట్ షాక్‌తో మిల్లర్ కూలీ మృతి

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేట: కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన సంఘటన సోమవారం మీర్జాపల్లి-శంకరంపేట రోడ్డు కల్వట్ వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందినట్లు స్థానిక ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా రోడ్డులో కల్వర్టు నిర్మాణంలో మిల్లర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడని తెలిపారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్ల గోపి(25)గా గుర్తించారు. స్థానిక ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News