Monday, December 23, 2024

కేంద్రంపై మిల్లర్ల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

బియ్యం అప్పగింతలో ఎఫ్‌సిఐ
జాప్యానికి మాపై నిందలా?
అసత్య ప్రచారాలు తగదు
75లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం మిల్లింగ్ చేసి నిల్వ
ఉంచినా కేంద్రం తీసుకోవడం
లేదు పంట దిగుబడి
పెరిగినందున సిఎంఆర్ గడువు
పెంచాలి నిల్వకు తగినంత
స్థలం లేదు, గిడ్డంగుల సామర్థ్యం
పెంచాలి రైస్ మిల్లర్ల
అసోసియేషన్ డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త మకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లిం గ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియలో ఎఫ్‌సిఐ అలవిమాలిన జాప్యం వల్ల తాము అపవాదులు, నిందలు, విమర్శలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మంగళవారం పీపుల్స్‌ప్లాజాలో ఏ ర్పాటు చేసిన మీడిమా సమావేశంలో అసోసియేష న్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేంద్ర మాట్లాడుతూ ధాన్యం మిల్లింగ్‌లో తమ తప్పు లేనప్పటికీ అనసరంగా తమను విమర్శించటం తగదన్నారు. రైస్ మిల్లర్లపైన అసత్య ప్రచారాలు ,అపోహలు చాలా వస్తున్నాయన్నారు. రైస్ మిల్ ఇండస్ట్రీ లో చాలా స మస్యలు ఉన్నాయన్నారు.

2104నాటికి రాష్ట్రంలో 1815రైస్‌మిల్లులు ఉండేవని , 2023నాటికి వీటి సంఖ్య 3368కి పెరిందన్నారు.2014నాటికి రా ష్ట్రంలో ఖరీఫ్ రబి సీజన్లలో కలిపి ధాన్యం సేకరణ 24.28లక్షల మెట్రిక్ టన్నులు(రూ3391కోట్లు) మాత్రమే ఉందేదన్నారు. 202223నాటికి ఇది 127.03లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. ధాన్యం విలువ కూడా రూ.26,290కోట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో 3000 మిల్లర్ల లో ఎక్కడో ఒక దగ్గర డిఫాల్ట్ జరుగుతుందని అంగీకరించారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం తమకు నూకల నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1400 కోట్లు ఎఫ్ సిఐ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మిల్లర్లకు రావాల్సివుందన్నా రు. మిల్లర్ల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి ఉంచామని ఈనిల్వలు తీసుకోవాలని పదే పదేకోరుతున్నా కేంద్రం తీసుకోవడం లేదన్నారు.

 

యాసంగిలో ధాన్యం మిల్లింగ్ చేస్తే 50 శాతం ధాన్యం నూకలు అవుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధాన్యం ఎక్కువ పండుతోందన్నారు. ఈ యాసంగిలో అకాల వర్షాలు అధిక వర్షాలు ఎక్కువ రావడం తో ధాన్యం పలు మార్లు తడిచిందని, అనుకున్న విధంగా రైస్ రాదని, తక్కువ గా రికవరి వస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేయకుండా తెస్తూ, తరుగు కింద వారంతట వారే క్వింటాలుకు రెండు కిలోలు అధికంగా తీసుకోమని వత్తిడి తేవటం వల్లనే కొంత ఎక్కువ తీసుకోవాల్సి వస్తోందన్నారు. రైతు లు ఎఫ్‌సిఐ ప్రమాణాలమేరకు నాణ్యమైన ధాన్యం ఇస్తే తమకు ఎక్కువ ధాన్యం ఇచ్చే అవసరం లేదన్నారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాలుకు గతంలో 67 కిలోల వచ్చేవని , వర్షాల్లో ధాన్యం పదేపదే తడిచిన తరువాత 60 కిలోలు వస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో విపరీతమైన ఎండల వల్ల వేడి పేరిగిందన్నారు.యాసంగి ధాన్యం ఎండల ధాటికి నూక శాతం పెరిగడం వల్ల బాయిల్డ్‌కు మాత్రమే ఈ ధాన్యం పనికి వస్తుందన్నారు.

ఎఫ్‌సిఐ ఈ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. పంట దిగుబడి ఏడింతలు పెరిగిందనందు వల్ల సిఎంఆర్ గడువు కూడా పెంచాలన్నారు. ఖరీఫ్ ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి బియ్యం అప్పగించేందుకు ఈ సెప్టెంబర్ వరకూ గడువు ఇవ్వాని కోరుతున్నట్టు తెలిపారు. మిల్లర్ల వద్ద ధాన్యం,బియ్యం నిల్వలకు తగినంత స్థలం లేదన్నారు. మిల్లింగ్ బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌సిఐ వెంటవెంటనే తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఎఫ్‌సిఐ గిడ్డంగుల్లో నిల్వ సామర్ధాన్ని 40లక్షల మెట్రిక్ టన్నుల సామర్దానికి తగినట్టుగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఎఫ్‌సిఐకి బియ్యా న్ని అప్పగిస్తామని మిల్లర్లు పదేపదే కోరుతున్నా తీసుకోకుండా రైస్ మిల్లర్ల ని చాలా మంది దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బియ్యం అప్పగింతకు కేంద్ర ప్రభుత్వం స్థలం చూపించాలన్నారు. అన్ లోడ్ కావడానికి వారం రోజులు పడుతుందని ఈ జాప్యాన్ని నివారించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. బియ్యం ఎగుమతి నిషేధం ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు.తమకు ఉన్న సమస్యల్లో అధికశాతం సమస్యలకు కారణం ఎఫ్ సిఐ మాత్రమే అని అషోసియేషన్ అధ్యక్షుడు నాగేంద్ర స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రావుతోపాటు పలు జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News