Wednesday, January 22, 2025

లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: లిఫ్టులో బిడ్డను ప్రసవించిన ఒక మహిళ ఆ పసిగుడ్డును చెత్తడబ్బాలో పారేసి వెళ్లిపోయిన సిసిటివి దృశ్యాలను చూసిన కోట్లాది మంది చైనా ప్రజలు షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ సిసిటివి ఫుటేజ్‌లను చూసిన నెటిజన్లు కర్కశురాలైన ఆ మహిళపై ఆగ్రహంతో శాపనార్థాలు పెడుతున్నారు. ఆగస్టు 21న ఈ దారుణ ఘటన జరిగినట్లు సిసిటివి ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.

చాంగింగ్ నగరంలోని ఒక అపార్డ్‌మెంట్ లిఫ్టులోకి లగేజ్‌ను మోసుకుంటూ ఒక మహిళ ప్రవేశిస్తున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. కొద్ది క్షణాల తర్వాత ఆ మహిళ ఆ మహిళ తన పాంటు కాలిలోపల నుంచి ఒక శిశువును బయటకు లాగివేసింది. ఆ తర్వాత ఆ బిడ్డ శరీరంపై ఉన్న రక్తపు మరకలతోపాటు నేలమీద పడి ఉన్న మరకలను టిష్యూ పేపర్‌తో తుడిచివేసింది. లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి.

అయితే ఆ మహిళ చేష్టలను అక్కడే ఉన్న వృద్ధురాలు గమనించింది. ఆ పసిగుడ్డును చూసిన అపార్ట్‌మెంట్ నివాసలు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ చాంగ్‌కింగ్‌కు వచ్చిన ఒక పర్యాటక బృందం సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. ఆ బిడ్డను తీసుకోవడానికి టూర్ గైడ్ తమ ఆసుపత్రికి వచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆ మహిళ నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని తీసుకుని ఆమె ఎందుకు ఈ పని చేయవలసి వచ్చిందో ఆరా తీస్తున్నట్లు తెలుసోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News