Sunday, February 23, 2025

నాలుగేళ్లలో దేశంలో 10 కోట్ల మంది ధనవంతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ధనికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వచ్చే నాలుగేళ్లలో వీరి సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలయిన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలకపాత్ర పోషించిన వీరు రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది.‘ ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్‌లో ధనికుల సంఖ్య 2022 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం దేశంలో ధనవంతుల సంఖ్య 6 కోట్లుగా ఉంది.అంటే నాలుగేళ్లలో 64 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ఉన్న దేశాలు ప్రపంచ వ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు( ప్రస్తుత మారక విలువ ప్రకారం రూ.8.3 లక్షలు) , అంతకంటే ఎక్కువ ఉన్న వారిని ధనవంతులుగా గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ధనవంతులుగా నిర్వచించింది. ప్రస్తుతం పని చేస్తున్న వారి జనాభాలో 10 వేల డాలర్లకు పైగా ఆర్జిస్తున్న వారి సంఖ్య 4 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News