ఈనెలలో రవాణాశాఖకు వచ్చిన ఆదాయం 36 లక్షలు
హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన వాహనాలకు చిరునామాగా ఉన్న హైదరబాద్ నగరంలో సంపన్న వర్గాలు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. సాధారణంగా అంకెల్లో పెద్ద సంఖ్య అయిన 9 అంటే ఎవరికైనా ఇష్టమే. తదునుగుణంగా ఆర్టిఏ కార్యాలయాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్ సిరిస్ ప్రారంభమైతే ఎస్‌యువీలు, డొమెస్టిక్ సెగ్మెంట్లో హై ఎండ్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన యజమానులు 9,99, 999, 9999 నెంబర్ల కోసం భారీగా పోడటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ కార్యాయల్లో జరుగుతున్నదే. అయితే 1989లో కొత్తగా అమల్లోకి వచ్చిన కేంద్ర రవాణా చట్టం అమల్లోకి వచ్చిన తరావత అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు అక్షర క్రమంలో రవాణాశాఖ రిజిస్టేరషన్ నెంబర్లను కేటాయించింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరబాద్ జిల్లాకు 9 నుంచి 14 నెంబర్లను రాష్ట్ర రవాణాశాఖ కేటాయించింది. ఇందులో 9 సంఖ్య సెంట్రల్ జోన్ ,10 నార్త్ జోన్ ,11 ఈస్ట్ జోన్, 12సౌత్ జోన్ 13 వెస్ట్ జోన్‌కు కేటాయించిన విషయం తెలిసిందే.
అందరి చూపు 9 వైపు కాగా సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య 9 కావడంతో పాటు నగరంలోని అన్ని సంపన్న వర్గాలు నివసించే దాదాపు సెంట్రల్ జోన్ పరిధిలోకి రావడంతో సెంట్రల్ జోన్లో ఫ్యాన్సీ సెంబర్లుకు దక్షిణాది ఇతర రాష్ట్రాలో పోల్చుకుంటే భారీ ఆదాయం రావడానికి కార ణం రిజిస్ట్రేషన్ సంఖ్య 9 కావడమే . ఈ నేపథ్యంలో నెల్లో జరిగిన నెంబబర్ల వేలం పాటలో సెంట్రల్ జోన్లో జరిగిన టిఎస్ 9 ఈ డబ్య్లూ సిరిస్ నెంబర్లకు పలువురు పోటీ పడగా రవాణాశాఖకు రూ.ఈ నెలలో ఈ నెల రూ. 35 లక్షల 58 వేలు 777 ఆదాయం వచ్చినట్లు అదికారులు చెబుతున్నారు. రవాణశాఖ ఆన్‌లైన బిడ్డిగ్లో టిఎస్ 09 ఎఫ్‌వి 9999 నంబర్‌ను వేలంలో పాటలో రూ.4 లక్షల 49 వేల 499 నంబర్‌ను సదరు వాహన యజమాని జి. రాజశేఖర్ రెడ్డి దక్కించుకోగా టిఎస్ 09 ఎఫ్ డబ్లూ 0001 నెంబర్‌ను శ్రీనిధి ఎస్టేట్ ఎంటర్ ప్రైజెస్ నిర్వహకలు రూ.4 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. అదే విధంగా టిఎస్ 09 ఎఫ్ డబ్లూ 0099 నంబర్‌ను వేలం పాటలో వై.బిందు రెడ్డి రూ. 3లక్షల 72 వేలు చెల్లించి దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లో రవాణాశాఖ కార్యాలంయంలో ఆన్లైన్ వేలం పాటలో రవాణాశాఖకు శుక్రవారం జరిగిన ఒక్క రోజే 12,21,999 వచ్చిందని అధికారులు చెబుతున్నారు.