Friday, December 20, 2024

బిఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం: ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపి

- Advertisement -
- Advertisement -

 

ఛత్రపతి శంభాజీనగర్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని, ఆ సార్టీతో పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడలేమని ఔనంగాబాద్‌కు చెందిన ఎఐఎంఐఎం లోక్‌సభ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో పాదం మోపేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గత సోమవారం ఔరంగాబాద్‌లో భారీ బహింగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.

Also Read: నేడే బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపి జలీల్ విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ సభను బట్టి బిఆర్‌ఎస్ బలాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని అన్నారు. ఆ పార్టీతో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన తెలిపారు. ముందు ఆ పార్టీ తన సత్తా ఏమిటో చూపించాల్సి ఉంటుందని, మహారాష్ట్రలో పార్టీ క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాల్సి ఉంటుందని జలీల్ చెప్పారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొద్ది నెలల తర్వాత బిరాఎస్‌తో పొత్తు గురించి మీరు ప్రశ్నిస్తే బాగుంటుందని ఆయన విలేకరులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News