Friday, April 4, 2025

పాతబస్తీలో విద్యుత్ చౌర్యం.. ఆరికట్టడానికి వెళ్లిన ఉద్యోగులపై ఎంఐఎం నేత దాడి.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ ఉద్యుగులపై ఎంఐఎం నేత మహమ్మద్ అజం దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన నగరంలోని కార్వన్ అసెంబ్లీ నియోజకవర్గం మెహబూబ్ కాలనీలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కాలనీలో విద్యుత్ చౌర్యానికి గల కారణం తెలుసుకొని అరికట్టడానికి వెళ్లిన విద్యుత్ శాఖ ఉద్యోగులపై ఎంఐఎం నేత అజం, అతని అనుచరులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో నెటిజన్లు.. ఉద్యోగులపై దాడి చేసినా పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News