Monday, December 23, 2024

రాజాసింగ్‌ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి: స్పీకర్‌కు ఎంఐఎం లేఖ

- Advertisement -
- Advertisement -

MIM Leader Letter Speaker Pocharam over Raja Singh

మన తెలంగాణ/హైదరాబాద్: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం శాసనసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఐఎం పార్టి ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ శాసనసభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీ ఎంఎల్‌ఎగా ప్రమాణం ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దంగా ఆయన మాటలు ఉన్నాయని పేర్కొన్నారు.

రాజాసింగ్‌ను అసెంబ్లీ నుండి బహిష్కరించడమే గాకుండా అతనిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించాలని కోరారు. కాగా, సెక్షన్ 41 పిఆర్‌సిపి కింద నోటీస్ ఇవ్వలేదనే కారణంతో రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చారని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఆయన తనను కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే రాజాసింగ్ ఆ వీడియో విడుదల చేశారని ఆయన మండిపడ్డారు. రాజాసింగ్‌ను అరెస్టు చేసి వీడియో శాంపిల్స్ తీసుకోవాలని కోరారు. రాజాసింగ్‌ను బిజెపి సస్పెండ్ చేయడం కంటి తుడుపు చర్య మత్రమే నని ఆయనన్నారు. నుపుర్ శర్మను ఇప్పటివరకు పార్టీ నుండి బహిష్కరించలేదని ఓవైసి చెప్పారు.

MIM Leader Letter Speaker Pocharam over Raja Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News