Saturday, November 2, 2024

బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు రాకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చిందని, 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ప్రత్యేక ఓటు బ్యాంక్‌గా మారబోతున్నారని చెప్పారు. హిందూ దేవీదేవతలను కించపరిస్తే ముందుగా స్పందించేది బిజెపి మాత్రమేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు.

అన్ని పార్టీలు కలిసి బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వెనుకంజ వేసేది లేదని తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెచ్చి రామరాజ్యం స్థాపిస్తామని బండి సంజయ్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్ శివారు మన్నెగూడలో బిజెపి శక్తి కేంద్రాల సభలో పాల్గొనే వక్తల వర్క్‌షాప్ ముగింపు సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణలో బిజెపి ఈనెల 10 నుంచి 25 వరకు దేశంలో చరిత్ర సృష్టించే విధంగా శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతుందని అన్నారు. బిజెపిలో కొత్త నాయకులను తయారుచేయాలనే లక్షంతో ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

కార్నర్ మీటింగ్‌లలో బిజెపికి తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరగుతుందన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు స్ఫూర్తితో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణలో చరిత్రలో ఏడాదికి 15 బహిరంగ సభలను నిర్వహించిన ఘతన బిజెపికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో బిజెపి తప్పితే ఇతర పార్టీలకు క్షేత్రస్థాయిలో మీటింగ్‌లు పెట్టే దమ్ములేదన్నారు. 11వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు అనంతరం అసెంబ్లీల వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News