హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమ్మిళిత, సామరస్య, అభివృద్ధి దేశానికి రోల్ మోడల్‌గా మారిందని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ తెలిపారు. తెలంగాణలో ఎలాంటి ఘర్షణలకు తావులేదన్నారు. శనివారం శాసన సభలో అక్బరుద్ధీన్ మాట్లాడారు. తొమ్మిదేళ్లలో స్వల్పకాలంలోనే తెలంగాణ అభివృద్ధి సాదించిందని, జైపూర్ రైల్ ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందని అక్బరుద్ధీన్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వ చర్య దేశానికి గొప్ప సందేశం పంపిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ కు అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో చేపట్టిన అన్ని పథకాలు అద్భుత ఫలితాలను సాధిస్తోందని, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అందిస్తున్నామని, తెలంగాణ రెండంకెట అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు.
Also Read: నర్సుగా మారి స్నేహితుడి భార్యను చంపాలనుకుంది….
తెలంగాణలో దాదాపుగా 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని, ముస్లీం మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందని, మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పలు పథకాలు చేపట్టారని అక్బరుద్ధీన్ కొనియాడారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉండడం గర్వంగా ఉందని, రెండో హజ్ హౌజ్ ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని, 59, 58 జిలో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తోందని మెచ్చుకున్నారు. ఆలయాలు, మసీదుల అభివృద్ధికి ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు. ఇమామ్, మౌజాములకు ఐదు వేల గౌరవ వేతనం ఇస్తున్న సిఎం కెసిఆర్‌కు అక్బరుద్ధీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు గ్రీన్ ఆపిల్ అవార్డు రావడం సంతోషించదగిన విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు.