Monday, December 23, 2024

రామగుండంలో గని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Mine accident at Ramagundam

నలుగురు మృతి,
మరో నలుగురు గల్లంతు
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

మన తెలంగాణ/రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనిలోని ఆర్జీ- 3 పరిధిలోని అడ్రియాల్ లోంగోవాల్ ప్రాజెక్టు పైకప్పు కూలిన ప్రమా ద ఘటనలో నలుగురు సిబ్బంది మృతి చెందగా మరో నలుగురు గాయలపాలయ్యారు. ఈక్రమం లో బొగ్గుగనిలో చిక్కుకుపోయిన అసిస్టెంట్ మేనేజర్ తేజతో సహా మరో ముగ్గురు కార్మికులు జాది వెంకటేశ్వర్లు(ఆపరేటర్) రవీందర్ (బదిలీ వర్కర్) పిల్లి నరేష్ (ఎంఎస్) మీస వీరయ్య (సపోర్ట్ మెన్) మృతి చెందారు. ఈక్రమంలో మృతుల సంఖ్య మ రింత పెరిగే అవకాశంఉందని అధికారులు పేర్కొం టున్నారు. రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స ని మిత్తం రామగుండం సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి ప్రాంతంలోని మట్టిని తొలగిస్తే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..బొగ్గుగనిలో 86వ లెవల్ 6ఎ3 నుంచి ఎల్‌ఏసి మధ్యలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రూఫ్ సపోర్టింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న వారందరూ రూఫ్ కింద చిక్కుకుపోయారు.

అదేవిధంగా ఎఎల్‌పిలోని కూలిన స్థలంలో ఎస్‌డిఎల్ యంత్రం కింద నుంచి మాటలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందస్తుగా 3 రోజులు నుంచి 86 లెవల్‌లో కూలిపోకుండా పనులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయిందని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్కూ టీం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ప్రమాదం దురదృష్టకరం: పుట్ట మధుకర్

ఆండ్రియాల ఏరియా పరిధిలోని ఏఎల్పీ గనిలో సోమవారం జరిగిన గని ప్రమాదం దురదృష్టకరమని గని ప్రమాదంలో చిక్కుకున్న వారంతా క్షేమంగా తిరిగిరావాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆకాంక్షించారు. గని ప్రమాదం జరిగిన ఏఎల్పీ గనిని సందర్శించిన ఆయన ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గని ప్రమాదంలో ఆరుగురు చిక్కుకోగా ఎరుకల వీరయ్య అక్కడ నుండి బయటపడ్డాడని, ఎఫ్‌బిఎల్ ఆపరేటర్ వెంకటేష్‌ను రెస్కూ బృందం రక్షించి తీసుకురాగా, ఓవర్‌మెన్ నరేష్‌ను పైకి తీసుకువస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇంకా ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏరియా రక్షణాధికారి జయరాజ్, అండర్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, వీటిసి చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్‌లు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఆర్జీ 3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, ఆర్జీ 2 ఉపాధ్యక్షుడు అయిలి శ్రీనివాస్, నాయకులు దేవ శ్రీనివాస్, పర్శ బక్కయ్య, జక్కుల దామోదర్ తదితరులు ఉన్నారు.

ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

సింగరేణి రామగుండంలో బొగ్గుగని పైకప్పు కూలి ప్రమాదం జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిన వెంటనే సిఎం కెసిఆర్ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి సిఎండి శ్రీధర్‌ను సిఎం ఆదేశించారు. గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సిఎం కెసిఆర్ సిఎండి శ్రీధర్‌కు సూచించారు. రక్షణ చర్యలు చేపట్టామని, కూలిన శిథిలాల నుంచి కార్మికులను బయటకు తెచ్చే చర్యలను ముమ్మరం చేశామని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని సింగరేణి సిఎండి సిఎం కెసిఆర్‌కు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News