Sunday, December 22, 2024

అంగన్‌వాడీలకు సీతక్క తీపి కబురు

- Advertisement -
- Advertisement -

జీతాలను రూ. 13500 కు పెంచుతూ రూపొందించిన ఫైలపై తొలి సంతకం

పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి సీతక్క తొలి సంతకం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ సీతక్క డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆమె అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు మినీ అంగన్‌వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. మరోవైపు అంగన్‌వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. అంగన్‌వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సంతకం పెట్టారు. మొదటి సంతకంతోనే తమ జీతాలు పెంచడంపై అంగన్‌వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News