Friday, December 27, 2024

మహబూబ్ నగర్ లో మినీ క్రికెట్ స్టేడియం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బోయపల్లి రోడ్డులో ఉన్న మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక క్రికెట్ గ్రౌండ్స్ లో రూ.  7.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బ్యాటింగ్ ప్రాక్టీస్ నెట్స్, సర్ఫ్ వికెట్స్, బౌలింగ్ మెషీన్స్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్స్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం క్రీడాకారుల కోసం రూ. 10 లక్షలతో చేపట్టే డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ పనుల ప్రారంభానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన పనులకు స్థానిక ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలసి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు పాపరాయుడు, మోతిలాల్, పాషా, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, సెక్రటరీ రాజశేఖర్, అశోక్, గోపాల కృష్ణ, కృష్ణ మూర్తి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News