Wednesday, January 22, 2025

జి 20 మీడియా సెంటర్ వద్ద మినీ ఇండియా : మంత్రి అనురాగ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి20 సదస్సులో భారత్ మండపం కాంప్లెక్సు వద్ద ఏర్పాటు కానున్న అంతర్జాతీయ మీడియా సెంటర్ మినీ ఇండియాను ప్రతిబింబిస్తుందని కేంద్ర సమాచార , ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు. తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ సంస్కృతి, హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వతాల వరకు ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒకటి మీడియా సెంటర్ వద్ద సందర్శించే అవకాశం వివిధ దేశాల ప్రతినిధులకు కలుగుతుందని పేర్కొన్నారు.

జి 20 సదస్సులో చేసే తీర్మానాలు, చర్చల సమాచారం సేకరించడానికి వచ్చే దాదాపు 3000 మీడియా ప్రతినిధులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ప్రముఖుల ఇంటర్యూలు నిర్వహించడానికి చిన్నపాటి మీడియా బూత్‌లు కూడా ఏర్పాటైనట్టు తెలిపారు. సదస్సులో మొత్తం చర్చలన్నీ అల్ట్రా హై డిఫినిషన్ , 4 కె బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీల ద్వారా రికార్డు అవుతాయని, ఈ విధంగా దేశంలో ఇదివరకు ఏర్పాటు కాలేదన్నారు. ఎవరైనా తన ఫోటోతోపాటు దేశంలో ఏ ప్రాంతం అయినా నేపథ్యంలో కనిపించేలా గ్రీన్‌వాల్ ఏర్పాటు అవుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News