Saturday, April 5, 2025

ఏఫ్రిల్ 13న మినీ జాబ్‌మేళా..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె దేవేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ జాబ్‌మేళాలో మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్, జీపే బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్, బిజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఉద్యోగాల ఎంపికకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లమా విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని ఆయన తెలిపారు.

ఎంపిక కాబడిన వారికి నెలకు 8000 నుండి 16వేల వరకు వేతనం ఇవ్వబడుతుందని, అభ్యర్థులు 18-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు అర్హులన్నారు. ఇంటర్వూలు జరిగే ప్రదేశం జిల్లా ఉపాధి కార్యాలయం, కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీకాలేజ్ ఎదురుగా, నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పని సరిగా మాస్క్ ధరించాలని, లేనిచో ప్రవేశం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News