Sunday, December 22, 2024

ఫిబ్రవరి 12 నుంచి మినీ మేడారం

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగబోయే మినీ మేడారం జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జాతర జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం శనివారం కోరింది. కాగా, ఈ మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొస్తారు. గద్దెలపైన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం మహా జాతర జరుగుతుంది.

మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మేడారంలో నాలుగు రోజుల పాటు జాతరను గిరిజన సంప్రదాయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నాలుగు రోజుల సమయంలో నిత్యం లక్షల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సారలమ్మ సమ్మక్క గద్దెలకు చేరే నాటి నుంచి తిరిగి వన ప్రవేశం చేసేంత వరకు దాదాపు భక్తుల సంఖ్య కోటికి పైగా చేరుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ జాతరకు భక్తులు తరలి వస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News