- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్ర 5గంటల వరకు వరంగల్ లో 49.25 శాతం, ఖమ్మంలో 57.91శాతం, కొత్తూరులో 85.42 శాతం, అచ్చంపేటలో 68,80శాతం పోలింగ్ నమోదైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, కొత్తూరు, జడ్చర్ల, సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీలకు శుక్రవారం ఎన్నికలు జరిపారు. మే 3తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, విజయంపై టిఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Mini municipal elections ended in Telangana
- Advertisement -