Sunday, February 2, 2025

కూకట్‌పల్లిలో మినీ ట్రక్కు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మినీ ట్రక్కు బీభత్సం సృష్టించిన సంఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మలుపు వద్ద రోడ్డుపై మహిళ సూర్యకుమారి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే మూలమలుపు వద్ద టర్న్ తీసుకుని మినీ ట్రక్కు వేగంగా వచ్చింది. మూలమలుపు వద్ద అతివేగంగా ఉండడంతో తిరిగే సమయంలో అదుపు తప్పింది. దీంతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఒక వైపు ఢీకొట్టింది. దీంతో మహిళ కందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. టుక్కు ముందుకు వెళ్లి బోల్తాపడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న సిసి కెమెరాలో సంఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News