రోజురోజుకి చలి విపరీతంగా పెరుగుతోంది. ఈ సీజన్ లో సాక్స్, మఫ్లర్స్, క్యాప్స్ లాంటి చిన్న బట్టలు చలి నుంచి కాపాడుకోవడానికి ఎక్కువగా వాడుతాము. అయితే, చలికాలంలో చల్లటి నీళ్లలో బట్టలు ఉతకాలంటే ఒక టాస్క్ అని చెప్పవచ్చు. కానీ బట్టలను క్రమం తప్పకుండ వాష్ చేసుకోవాలి. ఈజీగా బట్టలను వాష్ చేసేందుకు అనేక మినీ వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రూ.2,000 కంటే తక్కువ ధరతో వస్తున్న వాషింగ్ మెషిన్లు గురుంచి తెలుసుకుందాం.
రేయాన్ష్ పోర్టబుల్ వాషింగ్ మెషిన్
ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషిన్ సామర్థ్యం 2 కిలోలు. ఇది తక్కువ పవర్‌తో బట్టలలో అంటుకున్న దుమ్ము, ధూళిని సులభంగా తొలిగిస్తుంది. పిల్లల బట్టలు, తువ్వాళ్లు, టీ-షర్టులు వంటివి ఉతకడానికి ఇది సరైనది. దీని ఉపయోగించిన తర్వాత ఇంట్లో సులభంగా పెట్టుకోవచ్చు. తేలికగా ఉండటం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కాగా, ఇది అమెజాన్‌లో రూ. 1,499కి అందుబాటులో ఉంది.
వెల్విజి సెమీ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మినీ వాషింగ్ మెషిన్
ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఆపరేట్ చేయడం చాలా సులభం. ఇందులో చిన్న చిన్న బట్టలు ఉతకడంతో పాటు బొమ్మలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఉపయోగించిన తర్వాత ఈజీగా ఇంట్లో ఒక పక్కన పెట్టొచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 1,699కి విక్రయానికి అందుబాటులో ఉంది.
వెర్నాక్సీ వాషింగ్ మెషిన్ పోర్టబుల్
వన్ పీస్ రబ్బరు మౌల్డింగ్‌తో కూడిన ఈ వాషింగ్ మెషిన్ ఫోల్డబుల్ డిజైన్‌లో వస్తుంది. దీని ఎక్కడికైనా ఈజిగా క్యారి చేయొచ్చు. 2 కిలోలు సామర్థ్యంతో బట్టలపై మరకలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఇది చిన్న బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు. కాగా, ఇది అమెజాన్‌లో రూ. 1,399కి అందుబాటులో ఉంది.