Thursday, January 23, 2025

నగరానికి దూరంగా మినీ బస్సుల సేవలు

- Advertisement -
- Advertisement -

షేర్ ఆటోల్లోనే కాలనీ వాసులు ప్రయాణం

Minibus services away from the city
మనతెలంగాణ, సిటీబ్యూరో: నగరంలో బస్సులు ప్రధాన రహదారులకే పరిమితం అవుతున్నాయి. కాలనీలకు బస్సుల వేయాలని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, డయల్ యువర్ ఆర్టిసి ఆఫీసర్ కార్యాక్రమంలో ప్రయాణికులు విజ్ఞప్తి చేసినా ఆర్టిసి చేతులు ఎత్తివేస్తోంది. ప్రజా ప్రతినిధులు ఆర్టిసికి విన్నవించినా ప్రయోజనం లభించడం లేదు. ఈ మధ్యనే నగరంలో ప్రారంభించిన వజ్ర మిని బస్సులు కూడా జిల్లాలకు వెళ్ళే ప్రయాణికులకు పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 2750 బస్సులు ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. వీటిలో ఏ బస్సు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్ని సార్లు మరమ్మత్తులు చేసినా ప్రయోజనం అంతంత మాత్రమే. వీటి స్థానంలో కొత్త బస్సులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతూనే ఉన్నారు.. దీంతో వారు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే తప్పని సరిగా జూబ్లీ,మహత్మాగాంధీ బస్టేషన్లకు చేరుకోవాల్సిందే. కాలనీల నుంచి ప్రధాన రహదారులకు చేరుకునేందుకు ప్రమాదకరమైన పరిస్థితుల్లో షేర్ ఆటోలను కాలనీ వాసులు ఆశ్రయిస్తున్నారు. మెట్రో వస్తున్న వేళ ప్రధాన రహదారిని కలుపూతూ కాలనీలకు బస్సులను నడపాల్సిన అవసరం ఉన్నా అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.అయితే ప్రస్తుతం నగరంలో కొన్ని ప్రాంతాల్లో మినీ బస్సులు తిరుగుతున్నా అవి కాలనీలు,బస్తీల్లో ఉండే వారి అవసరాలు మాత్రం తీర్చలేక పోతున్నాయి పాత బస్తీ ప్రజాప్రతినిదులు ఇప్పటికే రవాణాశాఖ ఉన్నతాధికారులు అనేక విజ్ఞప్తులు కూడా చేసినా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మినీ బస్సులకు ఇంతటి ప్రాధాన్యత ఉన్నా ఆర్టిసి అధికారులు అవి ఏమీ పట్టించుకోవడం లేదు.

అందుబాటులోకి రాని సాంకేతిక పరిజ్ఞానం:

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. రూ కోట్లు వ్యయం చేసి ఆర్టిసి కోట్ల వ్యయం చేసికుని సాంకేతిక పరిజ్ఞాన్ని సమకూర్చుకుంది. కాని దాన్ని అమలు చేయడంలో నిర్లక్షం ప్రదర్శించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు వచ్చే సమయాలు ఏ స్టాపులో డిజిటల్ బోర్డులను కనిపించవు. బస్టాపుల్లో బస్సుల సమాచారం ప్రయాణికులకు తెలియడం లేదు. ప్రధాన కాలనీల నుంచే మినీ బస్సులు,టికెట్ కౌంటర్‌కు వెళ్ళాల్సిన పని లేకుండా టిఎస్ ఆర్టిసిలో యాప్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవడం, కాలనీకి ఎంత సేపట్లో బస్సు వస్తుందో యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఇవే సేవలు నగరంలో తిరిగే బస్సు ప్రయాణికులకు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు.బస్సుల గమనం తమ సెల్ పోన్లలో తెలియచేయాలనుకుంటున్నారు.బస్సుల గమనాన్ని పరిశీలించి ప్రయాణికులు లేని రూట్లలో బస్సులు తగ్గించి రద్దీ ఎక్కువగా ఉన్న రహదారుల్లో తిప్పుతామని ఆర్టిసి ప్రకటించినా అవి ఇంత వరకు అందుబాటులోకి రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News