Saturday, December 21, 2024

పార్టీ గుర్తును ఆవిష్కరించిన జనార్ధన రెడ్డి!

- Advertisement -
- Advertisement -
12 మంది అభ్యర్థులు, మేనిఫెస్టో ప్రకటన!!

గంగావతి(కొప్పల్): కర్నాటక మాజీ మంత్రి, గనుల దిగ్గజం జి. జనార్ధన రెడ్డి సోమవారం తన పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి ప్రకాశ’(కెఆర్‌పిపి)ని, తనా పార్టీ గుర్తు ‘ఫుట్‌బాల్’ను ప్రకటించారు. అంతేకాక 12 మంది అభ్యర్థుల తొలి జాబితా, పార్టీ మేనిఫెస్టోను వెల్లడించారు. మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

అక్రమ మైనింగ్ కేసులో రెడ్డి నిందితుడు. ఆయన దశాబ్దాల వరకు బిజెపితో ఉన్నారు. బళ్లారి బెల్ట్‌లో ఆయన పార్టీ బిజెపి పార్టీ ఓట్లపై కాస్త ప్రభావం చూపనున్నది. రెడ్డి పార్టీ కెఆర్‌పిపి కళ్యాణకర్నాటక(ఇదివరకటి హైదరాబాద్‌-కర్నాటక) ప్రాంతంలోని నియోజకవర్గాల్లో దృష్టి సారించనున్నది. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు.

కొప్పల్ జిల్లాలోని గంగావతి నుంచి తాను పోటీచేయబోతున్నానని, తన భార్య అరుణ లక్ష్మి బళ్లారి నగరం నుంచి పోటీచేయబోతున్నట్లు జనార్ధన్ రెడ్డి తెలిపారు. మరి 10 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. వారు: మహేశ్(హిరియూర్), శ్రీకాంత్ బండి(నాగథన్), మల్లికార్జున నెక్కంటి(సింధనూర్), నాగేంద్ర నేరలెకుంటె(పావగడ), మెహబూబ్(ఇండి), లల్లేశ్ రెడ్డి (సేడమ్), అరెకెరె కృష్ణా రెడ్డి(బాగేపల్లి), భీమా శంకర్ పాటిల్(దక్షిణ బీదర్), దారప్ప నాయక(సిరుగుప్ప), డాక్టర్ చారుల్(కనకగిరి). తన పార్టీ దాదాపు 15 జిల్లాల్లో పనిచేయేనున్నదని ఆయన తెలిపారు. ప్రజలకు తనపై, తన పార్టీపై మార్పు తెస్తానన్న నమ్మకం మెండుగా ఉన్నదన్నారు. వార్షిక ఆదాయం రూ. 5లక్షల కన్న తక్కువ ఉన్న వారికి ఆరోగ్య శ్రీ కవర్ చేస్తానని, ఇంటికి పెద్ద దిక్కయిన మహిళకు నెలకు రూ. 2500, ప్రతి ఇంటికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి కింద రూ. 2500 ఇస్తానని ఆయన ప్రకటించారు. కుటుంబ మహిళల పేరిట మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానని ప్రకటించారు. జనార్ధన రెడ్డి మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News