Monday, December 23, 2024

ముగిసిన కెటిఆర్ అమెరికా యాత్ర

- Advertisement -
- Advertisement -

Ministe KTR America trip ended

ఒక్క రోజే రాష్ట్రంలో నాలుగు ప్రధాన సంస్థల పెట్టుబడి ప్రకటనలు
భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలు
మంత్రితో నిర్వహించిన సమావేశం అనంతరం తమ నిర్ణయాలు ప్రకటించిన కంపెనీలు
ఆర్‌ఎ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ. 1750 కోట్ల పెట్టుబడులు
స్లేబ్యాక్ ఫార్మా సంస్థ రానున్న మూడేళ్ళలో రూ. 1500 కోట్ల పెట్టుబడులు
రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా ఔషధ తయారీ కేంద్రం ఏర్పాటు
క్యూరియా గ్లోబల్ హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన పర్యటన చివరి రోజున పెట్టుబడుల వరద పారింది. ఒక రోజున నాలుగు ప్రధాన సంస్థలు రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టనునున్నట్లు వెల్లడించాయి. ఫార్మా, లైఫ్‌సైన్సెస్ ఎదుగుదలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆ సంస్థలకు మంత్రి కెటిఆర్ వివరించారు. తన పర్యటన తుది రోజున రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా ఆయా కంపెనీలను ఆయన ఒప్పించగలగారు. దీంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి. దీంతో ఆయా రంగాల్లో నూతనంగా పెట్టుబడులు రావడమే కాకుండా స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు సైతం దక్కనున్నాయి.

హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని ప్రముఖ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్‌ఎ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌లో రూ. 1750 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ న్యూయార్క్‌లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు.

ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్‌ఎ చెమ్ ఫార్మా లిమిటెడ్, అవ్రా ల్యాబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ. 1750 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం తనకు అమిత సంతోషాన్ని కలిగించిందన్నారు. అడ్వెంట్ కంపెనీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇతర లాభదాయక పెట్టుబడి అవకాశాలను కంపెనీ అన్వేషిస్తుందన్న నమ్మకం తనకుందని… ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాము కెటిఆర్ భరోసా ఇచ్చారు.

రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న స్లేబ్యాక్ సంస్థ

న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా సంస్థ హైదరాబాద్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.రాబోయే మూడేళ్లలో సుమారు 15వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి కెటిఆర్‌కు తెలిపింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు వివరించారు. హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అభినందించారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలను ఉపయోగించుకుని స్లేబ్యాక్ కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న నమ్మకం తనుకుందన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ కంపెనీ సుమారు రూ. 2300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. మంత్రి కెటిఆర్ సమావేశం తరువాత స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సిఇఒ అజయ్ సింగ్ ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేసింది. 2011లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి సాధించిన పురోగతి, విజయాలను మంత్రి కెటిఆర్‌కు సమగ్రంగా వివరించారు.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టనున్న యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా

లైఫ్‌సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ రంగంలోని దిగ్గజ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. భారీ పెట్టుబడులతో తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా సంస్థ కూడా చేరింది. రెండు లక్షల వేల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ అధునాత ల్యాబ్ ఏర్పాటుతో ఔషధ తయారీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మంత్రి కెటిఆర్‌తో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇండియా ఆపరేషన్స్ హెడ్ స్టాన్ బుర్హాన్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజియన్స్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ కె.వి. సురేంద్ర నాథ్ ల సమావేశం తరువాత ఆసంస్థ ఈ పెట్టుబడి ప్రకటన చేసింది.

నగరంలో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు

న్యూయార్క్ కేంద్రంగా ఉన్న క్యూరియా గ్లోబల్ (ఇంతకు ముందు AMRI Global ) హైదరాబాద్ లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను రాబోయే 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఈ కంపెనీ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇతర క్యూరియా గ్రూప్ సంస్థలు, థర్ట్ పార్టీ సంస్థల కోసం ఔషధ రసాయన శాస్త్రంలో తయారీ, ఒప్పంద పరిశోధన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్యూరియా గ్లోబర్ వనరులతో మన దేశంలోని ఆ సంస్థ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఔషధ రసాయన శాస్త్రంలో ఈ గ్రూప్ కు మంచి పట్టుంది. క్యూరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకాష్ పాండియన్‌తో మంత్రి కెటిఆర్‌సమావేశం తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News