Saturday, November 23, 2024

కుటుంబసభ్యులతో సరదాగా…

- Advertisement -
- Advertisement -

Minister Allola buzz at the Qawwal Sanctuary

 

కవ్వాల్ అభయారణ్యంలో మంత్రి, ఆయన కుటుంబసభ్యులు

మనతెలంగాణ/హైదరాబాద్ : నిత్యం బిజీగా ఉండే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి కవ్వాల్ అభయారణ్యంలో గడిపారు. ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సింబల్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి మంత్రి ఫొటో దిగారు. అనంతరం కల్పకుంట్ల వాచ్‌టవర్ ఎక్కి వన్యప్రాణులను, అటవీ అందాలను వీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర, వన్యప్రాణుల సంరక్షణపై మంత్రి తన మనువలు, మనువరాలికి అవగాహన కల్పించారు. తరువాత గంగాపూర్ అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అంతకుముందు కుటుంబసమేతంగా కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి రిజర్వాయర్‌లో బోటు షికారు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News