Wednesday, December 25, 2024

మంత్రి కబ్జాలు చేశాడని నిరూపిస్తే..

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద ః మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూ కబ్జాలను నిరూపిస్తే ఆ భూమి వారి పేరునే పట్టాలు చేసేందుకు మంత్రి సిద్దం ఉన్నారని లక్ష్మణచాంద మండల నాయకులు అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటి చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లక్ష్మణచాందలో పర్యటించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పై చేసిన విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు.

సోమవారం నిర్వహించిన సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునంధన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి,జెడ్పిటిసి ఓస రాజేశ్వర్, బిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి అడ్వాల రమేష్‌లు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంతో అభివృద్ది చేస్తున్నారని, అది చూసి ఓర్వలేకనే ఆయన పై విమర్శలు చేస్తున్నారన్నారు. సరిగ్గా ఏ పార్టీలో ఉంటావో తెలియని నీవే ఇలా మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. నిర్మల్ ప్రజలు రెండు సార్లు బుద్ది చెప్పిన ఇంకా మార్పు రాలేదని ఎద్దెవా చేశారు.

తెలంగాణలో 70 ఏళ్లలో జరుగని అభివృద్ది కేవలం ఏమిదేళ్లలలోనే చేసి చూపించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం బిఆర్‌ఎస్ పార్టీయే భారీ మెజార్టీతో గెలువనుంది ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జహీర్, సాతం గంగారాం,ముత్యం, మహిపాల్,పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News