Thursday, January 23, 2025

దుర్గామాత బోనాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రతినిధి : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శంగా నగర్ వార్డ్‌లో దుర్గా మాత ఆలయంలో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ వారు మహిళలు మంత్రికి మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొన్ననే హైదరాబాద్‌లో గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయని ఆ బోనాల తరువాత రాష్ట్రమంతా బోనాల పండుగ ప్రారంభమైనట్లు తెలిపారు. ఆషాడ మాసంలో ప్రతీ ఒకరూ అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారని చల్లంగా ఉంచమని అమ్మవారిని వేడుకుంటారని తెలిపారు.

అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వర్షాలు సకాలంలో పడాలని పంటు సమృద్దిగా పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాట్లు తెలిపారు. ఈ ఆలయానికి రూ. 15 లక్షల మంజూరు చేసి నిర్మించామని తెలిపారు. ఆడెల్లి పోచమ్మ ఆలయాన్ని 15 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. నందిగుండం గండి రామన్న చింతకుంటవాడ బాలాజీ వాడ బుధవార్‌పేట్ ఇలా పట్టణంలో అన్ని ఆలయాలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధ్ది చేస్తున్నట్లు తన దేవాదాయశాఖ మంత్రి ఉండడం వలనే నిర్మల్‌లో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News