Wednesday, January 22, 2025

పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వైసీపీకి మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. రాజకీయ పొత్తుతో ఎన్నికలకు వెళితే పవన్ కు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని మంత్రి అంబటి ప్రశ్నించారు. చెప్పుల రాజకీయాలు చేస్తోంది పవన్ కళ్యాణేనని విమర్శించారు.

వెండితెరపై పవన్ కళ్యాణ్‌ను హీరోలా చూసే అవకాశం ఉందని, రాజకీయాల్లో మాత్రం ఆయన నటన కమెడియన్‌గా కనిపిస్తోందని అన్నారు. రాంబాబు వ్యాఖ్యలు ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు, మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ దృశ్యాన్ని విశ్లేషించి, పవన్ కళ్యాణ్ రాజకీయ విధానంలో స్పష్టత లేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News