Wednesday, January 22, 2025

చంద్రబాబును అరెస్టు చేస్తే సింపథీ వస్తుందని మాకు తెలియదా?

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేయకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయనట్లు అవుతుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతిలో అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ లో మార్పు వంటి అనేక కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఈడీ, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ అన్ని విచారణ సంస్థలు లోతుగా విచారణ చేశాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీకి ఈ కుంభకోణంతో సంబంధం లేదు.. సీమెన్స్ కంపెనీ కోర్టులో 164 నోటీసులో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజా ధనం లూటీ చేస్తే చంద్రబాబును అరెస్టు చేయకూడదా? చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సింపథీ వస్తుందని మాకు తెలియదా? అని మంత్రి అంబటి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News