Sunday, December 22, 2024

ఈనెల 25న రాష్ట్రానికి అమిత్‌షా రాక

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి దూకుడు పెంచింది. నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండటంతో పలువురు బిజెపి అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బిజెపి అధినేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్‌తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపి స్థానాల్లో పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగు తున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న అమిత్ షా రాష్ట్రంలో పర్య టిస్తారని కేంద్రమంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,

రాష్ట్ర పార్టీ ఇంచార్జి సునీల్ బన్సాల్ ఆది, సోమవారాల్లో వివిధ సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయి లో జరుగుతున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బహుళ దశల ప్రచారంలో మోడీ 3-4 సభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారని సమాచారం. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే 10న రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయంగా ప్రచారానికి మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత సిఎంలు వస్తారని తెలుస్తోంది. 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. కాగా, పార్టీ లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News