Saturday, October 5, 2024

ఆమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి ఆతిశీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ నగరానికి హర్యానా ప్రభుత్వం నీటిని తరలించాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్ష చేపట్టిన డిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆమరణ దీక్ష విరమించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె లోక్‌నాయక్ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో ఉన్నట్టు ఎక్స్ వేదికగా ఆమ్‌ఆద్మీ వర్గాలు తెలిపాయి. ఆమె రక్తం లోని చక్కెర స్థాయిలు అర్ధరాత్రి సమయంలో 43 కు పడిపోయాయి.

తెల్లవారుజామున 3 గంటల సమయానికి 36కు చేరాయి. దీంతో ఎల్‌ఎన్‌జేపీ వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రిలో చేరకుంటే ప్రాణాలకు ముప్పు వస్తుందని వైద్యులు హెచ్చరించారు. దాంతో మంగళవారం తెల్లవారు జామున మంత్రి ఆతివీ తన దీక్షను విరమించిన తరువాత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఢిల్లీలో మంచినీటి కొరతపై ప్రధాని మోడీకి లేఖ రాస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీలో మంచినీటి కొరత అంశాన్ని విపక్షాలతో కలిసి పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News