Monday, December 23, 2024

మంత్రి అతిషితో జెండా వందనం: ఎల్‌జికి ఆప్ ప్రభుత్వం లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 15న ఢిల్లీ ఆప్ ప్రభుత్వం తరఫున మంత్రి అతిషి జాతీయ జెండా ఎగురవేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ సోమవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం స్కామ్‌లో జైలులో ఉన్నారు.

తాను జైలుకు వెళ్లి సిఎంను కలిసి, విషయం చర్చించినట్లు, ఆయన సూచించినట్లు సహచర మంత్రి అతిషి పతాక వందనం చేసేలా ఏర్పాట్లకు ఆదేశాలు వెలువరించినట్లు సాధారణ పరిపాలనా విభాగం మంత్రి అయిన రాయ్ వెల్లడించారు. సిఎంకు బదులుగా స్థానిక ఛత్రశాల స్టేడియంలో కార్యక్రమం ఉంటుంది. ఈ విషయాన్ని తాము లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు లేఖ ద్వారా వివరించినట్లు కూడా మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News