Wednesday, January 22, 2025

రూపాయి, రూపాయి కూడబెట్టాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : రుణమాఫీ ప థకాన్ని అమలు చేసేందుకు ఎన్నో నిద్రలేని రా త్రులను గడిపామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు దాటకుండానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చే శారు. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కా ర్యక్రమం చేపట్టామని చెప్పారు. అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం అన్ని కుటుంబాల కు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్‌కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకురుణమాఫీ అందిస్తామని, ఎవరికీ ఆ పం.. ఎవరికీ అవకాశం ఇవ్వం అని పేర్కొన్నా రు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలని పా ర్టీ శ్రేణులకు సూచించారు. తల ఎత్తుకొని ఎ క్కడా తగ్గకుండా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్షల రూపాయల

రుణమాఫీని రూ.25,000 చొప్పున నాలుగు దఫాలుగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. రూ.ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ముందు సిఎం రేవంత్ రెడ్డి ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారని అన్నారు. సిఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారని, కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ అని, చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వివరించి రైతులు, ప్రజల హృదయాలు గెలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News