Friday, December 20, 2024

వేలానికి మీరెందుకు మద్దతు తెలిపారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: గోదావరి బేసిన్‌లోని కోల్ బ్లాకులను అప్పనంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించి అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పెద్ద బొగ్గు స్కాం కు పాల్పడిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క్ ఆరోపించారు కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని ఇందుకోసం బిజెపికి, బిఆర్‌ఎస్‌కు ఎలక్ట్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధిచేకూరిందని ఆయన పేర్కొన్నారు.గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సత్తుప ల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయిలతో కలిసి మాట్లాడారు. 2021 కోల్ బ్లాక్ ల వేలంలో సింగరేణి కంపెనీ పాల్గొనెందుకు సుముఖత చూపినా మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ వద్దని వారించి ఏకపక్ష తరువాయి 6లో
నిర్ణయం తీసుకున్నారన్నారు బిఆర్ఎస్ కు అనునాయులైన అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ భాగస్వామ్య ఆరో కోల్ కంపెనీ, శ్రీఅవంతికా కాంట్రాక్టర్స్, ప్రతిమా గ్రూప్ లకు కోల్ బ్లాక్ లు అప్పగించేందుకు సింగరేణిని బీఆర్‌ఎస్ కోల్ బ్లాకుల వేలంలో పాల్గొన కుండా చేసిందని ఆయన వివరించారు. కోయగూడెం బ్లాక్ ను అరో కోల్ మైనింగ్ లిమిటేడ్ కంపెనికి, సత్తుపల్లి బ్లాక్ లను అవంతిక కన్ స్ట్రక్షన్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టారని ఆయన చెప్పారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అరబిందో గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి కి కెసి ఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధం ఏమిటో అందరికి తెలుసు అని ఆయన అన్నారు.

అవంతిక కంపెనికి ఈ బొగ్గు గనులు దక్కడానికి ప్రతిభను చూపించిన ప్రతిమలు ఎవ్వరో కూడా బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు. అన్ని బొగ్గు గనులను తీసుకొవాలని 2021 అక్టోబర్ 29న నిర్ణయిస్తే గోదావరి తీరంలోని బొగ్గు గనులనుతీసుకోవోద్దని వారంలోపే అంటే 2021 నవంబర్ 5న నిర్ణయం తీసుకోవడంలో అంతర్యం ఏమిటో బహిరంగంగానే కనిపిస్తోందన్నారు.గోదావరి ఏరియాలో సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గుబ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని తాము శుక్రవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించబోతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన, కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థ భవిష్యత్తు కొనసాగాలంటే కొత్త గనులు రావడం తప్పనిసరి అని, ఈ గనులను వేలంపాట ద్వారా కాక నేరుగా ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కేటాయించమని అడుగుతామన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నికి చెందినవారు కనుక ప్రత్యేక చొరవ తీసుకోవాలని ,అవసరమైతే ప్రధానమంత్రి తో అఖిలపక్షం ద్వారా కలవడానికి సిద్దంగా ఉన్నామన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని ని అఖిలపక్షం కలవడానికి సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు.తెలంగాణ ప్రాంతంగనులను తెలంగాణకే ఇవ్వండి అని అడగడానికి మాకు ఎటువంటి భేషజాలు లేవని దీనికి సహకరించాలని కోరారు. .ఇటీవల వేలం పాటలో పెట్టిన సత్తుపల్లి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల వేలంపాటదారులు ఇప్పటివరకు ఆ గనులను చేపట్ట లేదని కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు..2015లోమైన్స్ అండ్ మినరల్స్ చట్టానికి సవరణ చేసినప్పుడు అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపితో కుమ్ముకై మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు దానికి భిన్నంగా వేలం పాటలు నిర్వహించకూడదు అంటున్నారని ఇది చాలా విడ్డూరం గా ఉందన్నారుఅనాడు వేలం వేయాలని కోరిన బి ఆర్ ఎస్ ఇప్పుడు ఎందుకు వద్దు అంటుందని ఆయన ప్రశ్నించారు.

వేలంపాటలో పాల్గొనకూడదు అని ఒక పక్క నిర్ణయం తీసుకొని సింగరేణిని పక్కకు ఉంచి సింగరేణి వ్యవస్ధను భ్రష్టి పట్టించారన్నారు.ఇక్కడ వేలంపాటలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకొని ఒడిస్సాలో మాత్రం వేలంపాటలో పాల్గొనాలని నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.బిఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం ఇకనైనామానుకోవాలన్నారు.బి ఆర్ ఎస్ పాలనలో సింగరేణి విధ్వంసానికి గురైందని, అనేక గనులు మూతపడ్డాయని కొత్త గనులు రాలేదని కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సింగరేణి సంస్థను, సింగరేణి ఆస్తులను, సింగరేణి ప్రాంత కొత్త గనులను కాపాడుకోవడం కోసం తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తామని ,ఇప్పటికే గత ప్రభుత్వ బొగ్గు శాఖ మంత్రి నీ తాను కలిసానని ఇప్పుడు కూడా ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి నీ అవసరమైతే ప్రధానినీ కలసి వేడుకోవడానికిసిద్ధంగా ఉన్నామని భట్టి స్పష్టం చేశారు. ఈవిలేఖర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News