Friday, December 20, 2024

దేశానికి దశ..దిశ తుక్కుగూడ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తుక్కుగూడ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టో విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమా ర్క తెలిపారు. ఇందులో దేశ దశ, దిశను నిర్ణయించే హామీలుంటాయని ఆయ న పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తాము తుక్కుగూడ నుంచే ఆరు గ్యారంటీలు ప్రకటించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చి న గ్యారెంటీలను తూ.చా తప్పకుండా అమ లు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి న గంటలోనే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో ప్ర జలు హాజరై తుక్కుగూడ సభను విజయవం తం చేయాలని భట్టి కోరారు. ఈనెల 06వ తేదీన జరుగనున్న జనజాతర సభ ఏర్పాట్ల ను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. ప్రధాన వేదిక, సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

గత పాపాలకు బిఆర్‌ఎస్‌దే బాధ్యత
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రం మన అందరిదని స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. అవాస్తవాలు మాట్లాడే బిఆర్‌ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని, పదేళ్లు పాలించిన బిఆర్‌ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత విషయాలు….
విపక్ష నేతలను టార్గెట్ చేసి బిఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడటం దారుణమన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్‌మెంట్‌లను వాడుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి పౌరుడి హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని, దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని, వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకున్నారన్నారు. జరిగిన నష్టానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

జూన్‌లో వచ్చిన వర్షాలను కెసిఆర్ ఒడిసి పట్టలేదు
జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కెసిఆర్ ఒడిసి పట్టలేదని, అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందకు వదిలారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిర్మాణ లోపంతో కాళేశ్వరంలో గోదావరి నీటిని కిందికి వదలాల్సి వచ్చిందని, కెసిఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి, సంకల్పబలంతో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందోన్నారు. తెలంగాణ మోడల్‌గా తుక్కుగూడలో ఏఐసిసి నాయకత్వం సందేశం ఇవ్వబో తోందని, ఇది గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. తుక్కుగూడ సభనుంచే ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఇచ్చిన 6 గ్యారంటీలను దేశమే ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నామన్నారు.

బిఆర్‌ఎస్ పాలనలో కుప్పకూలిన డిస్కంలు, జెన్‌కోలు
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను బోగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిస్కంలు, జెన్‌కోలు మీ పాలనలో కుప్పకూలిపోయాయని, కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నామని ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు. 2030-, 31 వరకు పీక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. 30 వేల ఉద్యోగాలను మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని, అదనపు పోస్టులు కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాట వినిపిస్తే తాటతీస్తామన్నారు. హైదరాబాద్ లో ఉన్న బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్ నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలని, ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

త్వరలో కారు ఖాళీ
బిఆర్‌ఎస్‌లో ఉండేందుకు ఎంఎల్‌ఎలు ఎవరూ ఇష్టపడటం లేదని, కారు ఖాళీ కావడం ఖాయమని మల్లు భట్టి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య పద్దతిలో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని రెండు పార్టీలు పదే పదే కూలగొడతాం, పడగొడతాం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు పార్టీ ఫిరాయింపులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం పటిష్టంగా లేకపోతే అనేక అనర్ధ్దాలకు దారితీస్తుందన్నారు. తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో ఒకరిద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు చేరే అవకాశం లేకపోలేదన్నారు.
ప్రస్తుత కరువుకు గత ప్రభుత్వమే కారణం
రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ కారణం కాదని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 7న అంటే చలికాలంలో ప్రభుత్వ పగ్గాలను చేపట్టామని, అప్పటికే వర్షకాలం అయ్యిపోయిందని, అయితే ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని గత ప్రభుత్వం సక్రమంగా నిల్వ చేయలేకపోవడం వల్లనే నేటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో వచ్చిన నీటిని ఒడిసి పట్టి, ప్రాజెక్టులను నింపి, మళ్ళీ వర్షాకాలం నాటికి జాగ్రత్తగా ఆ నీటిని కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైన కారణంగానే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వ చేతగానితనం వల్లనే నీటి ఎద్దడి ఏర్పడినప్పటికీ యుద్ధపాతిపదికన అన్ని జిల్లాలకు నిధులను కేటాయించామని అన్నారు. జిల్లా కలెక్టర్ల వద్ద మంచినీటి అవసరాల నిమిత్తం అవసరమైన నిధులను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. పొలాల్లో దిష్టిబొమ్మలాగా నిలబడి..

కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కరువు వచ్చిందంటే ఎవరూ నమ్మరన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని పెరిగే విద్యుత్ వినియోగాన్ని ముందుగానే అంచనా వేసి ఎలాంటి విద్యుత్ కొరత ఏర్పడ్డకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. కరెంట్ కోతల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో మెరుగైన విద్యుత్‌ను నిరంతరంగా అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలను తయారు చేశామని, లోక్‌సభ ఎన్నికల తరువాత ఆయా ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. తాము పదే పదే ఢిల్లీకి వెళ్ళడాన్ని ప్రతిపక్ష నేత తప్పు పడుతున్నారని, తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం వెళ్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి నిధులను తేవడానికి గానీ లేదా జివోల కోసమే వెళ్తున్నామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సైనిక సంస్థకు చెందిన భూముల కోసం, రీజినల్ రింగ్ రోడ్డు కోసం, ఇతర అభివృద్ధ్ది పనుల నిమిత్తమే వెళ్తున్నామన్నారు. గడిచిన మూడు నెలల వ్యవధిలో వేల కోట్ల నిధులను తెచ్చుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో వైరా ఎంఎల్‌ఎ రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు జావేద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News