Saturday, September 14, 2024

వడ్డీ భారం దించండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విభజన చట్టంలో పేర్కొన్న మే రకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇం కా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ లా సీతారామన్ ను కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆ ర్థిక పరిస్థితులను నిర్మలా సీతారామన్ కు వివరించామన్నారు. 2024 -15 లో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన కేం ద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఏపీ ఖాతాలోనే వేశారని అందులోని తెలంగాణ వాటా  నిధులు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారమన్నారు. 2019- 20 నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు రాష్ట్రానికి అందలేదని వాటిని కూడా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం 8 అంశాలపై కేంద్ర మంత్రిని కోరగా వాటిపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. వీటి పరిష్కారం కోసం త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించి సహాయం అందించాలని కోరామని, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి గుర్తు చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు చేసిందని, అవి రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయన్నారు. వీటిని రీ షెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కోరామని, రూ. 31,795 కోట్ల మేర అధిక వడ్డీ కి గత ప్రభుత్వం రుణాలు చేసిందని, వడ్డీ రేట్లు తగ్గించాలని కూడా కోరినట్లు చెప్పారు. జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తోందని, ఇలాంటి మొత్తం 8 అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు వివరించారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశామని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు గత కొన్నేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వాధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు.

చట్టానికి లోబడి మాత్రమే చర్యలు
హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని, వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అన్నారు. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని, ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని, శాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామని, అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని, ప్రజల ఆస్థులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News