Sunday, December 22, 2024

సాగు భూములకే రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వ్యవసాయం చేసే రైతులకే ‘రైతు భరోసా‘ పథకాన్ని వర్త్తింపజేయాలని మెజార్టీ రైతులు అభిప్రాయపడ్డారు. రైతు భరోసా పథకం అమలుపై మార్గదర్శకాలను ఖరారు చేసే నిమిత్తం రాష్ట్ర మంత్రివర్గం నియమించిన ఉప సంఘం బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించి రైతులు, ఇతరవర్గాల అభిప్రా య సేకరణ చేపట్టింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వర్క్‌షాపునకు మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించగా కమిటీ సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రె వెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, పొరి క బలరాంనాయక్, ఎంఎల్‌ఎలు, కలెక్టర్లు తదితరులు పా ల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హాజరైన పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. దాదా పు మూడు గంటల పాటు జరిగిన వర్క్ షాపులో రైతులతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు, వివిధ పా ర్టీల నేతల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భం గా పలువురు రైతులు మాట్లాడుతూ..సాగు భూములకే రైతు భరోసా అందించాలనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, పడావు బడ్డ బంజరు భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధును అందించి కోట్లాది రూపాయల నిధులను దుర్వినియో గం చేసిన నేపథ్యంలో కేవలం పంటలను సాగు చేసే రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. సన్న, చిన్న, మధ్యతరగతి రైతులందరికీ మేలు జరిగేలా కేవలం 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ సాయం అందించాలని మెజార్టీ రైతులు అభిప్రాయపడ్డారు.

కౌలురైతులకు లబ్ధి జరిగేలా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కేవలం సన్న రకాలుకే బోనస్ కాకుండా అన్ని పంటలకు బోనస్ ఇస్తూ 2011లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని తిరిగి పునరుద్ధరించి,2014కి ముందు రైతులకు అందిన అన్ని రకాల సబ్సిడీలను తిరిగి యధావిధిగా అమలు చే యాలని పలువురు రైతులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారని వీరందరికీ ఆర్థిక వెసులుబాటు కలిగించేవిధంగా వరి పంటకే కాకుండా మిగిలిన అన్ని పంటలకు బోనస్ కల్పించాలని పలువురు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News