Wednesday, January 22, 2025

సాకారం కానున్న నైనీ బొగ్గు ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

సింగరేణి కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైనీ బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మ ల్లు ఒడిశా ముఖ్యమంత్రిని కోరగా ఆయన వెంటనే స్పందించారు. నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇవ్వడమే కాకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైనీ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకు లు లేకుండా చూడాలని కోరేందుకు శుక్రవారం డిప్యూ టీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విక్రమార్క సింగరేణికి బొ గ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారు. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. నాటి వినతిపత్రాలను అందజేశారు.

తాడిచర్ల బ్లాక్, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామి క, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూ టీ సిఎం ఒడిశా సిఎంకు వివరించారు. అటవీ, ప్రైవే టు భూములను సింగరేణికి బదలాయించాల్సన అం శం పెండింగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒడిశా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు ఒ డిశా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడాని కి, ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైనీ బొగ్గు గ నులు అత్యంత ఆవశ్యకమని డిప్యూటీ సీఎం పునరు ద్ఘటించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖ ను ఒడిశా సిఎంకు అందజేశారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విన్నపంతో ఒడిశా సిఎం స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని

డిప్యూటీ సీఎం భట్టి బృందానికి స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నత అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తిని వీలైనంత త్వరలోనే ప్రారంభించే అవకాశాలు నెలకొన్నాయి. నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తికి ఆలస్యం కలిగిస్తున్న అంశాలపై ఒడిస్సా సీఎంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పనులు వెంటనే పూర్తయినట్లైతే మరో మూడు నెలల్లోపే సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తుందని, దీనికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనికి ఒడిశా ముఖ్యమంత్రి పూర్తి సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాల పై తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నైని బొగ్గు బ్లాక్ ప్రారంభానికి సంబంధించి ఐదు అంశాలు ప్రధానం…

ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే నైనీ బొగ్గు బ్లాకు సింగరేణి సంస్థకు గొప్ప వరం లాంటిది. 2015లో ఈ బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకు కేంద్ర బొగ్గు శాఖ కేటాయించినప్పటికీ పలు రకాల అనుమతుల విషయంలో ఇప్పటివరకు తీవ్ర జాప్యం జరిగింది. సింగరేణి సంస్థ నుండి ఎటువంటి లోపం లేకుండా ఎప్పటికప్పుడు కావలసిన పత్రాలను సమర్పించడం, చెల్లించాల్సిన సొమ్మును జమ చేయటం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గని అటవీ భూమి సేకరణకు సంబంధించి స్టేజీ-1 ,స్టేజీ-2 అనుమతులు కూడా లభించాయి. స్టేజీ-2 అనుమతుల్లో భాగంగా సింగరేణి సంస్థకు కేటాయించిన 783.27 హెక్టార్ల అటవీ భూమినీ సింగరేణికి కేటాయించే ముందు ఆ స్థలంలో ఉన్న చెట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. చెట్ల లెక్కింపు తర్వాత ఆ చెట్లను తొలగించి భూమిని సింగరేణి సంస్థకు ఆ రాష్ట్ర అటవీశాఖ అప్పగించాల్సి ఉందని, కనుకు తక్షణమే ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ఈ పనిని పూర్తి చేసి భూమిని అప్పగించేలా ఆదేశించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శ్రీ భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉండగా ఆ గ్రామస్తులకు చెల్లించాల్సిన ఆర్ అండ్ ఆర్ తదితర అంశాలపై చర్చించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిహాబిలిటేషన్ కమిటీ సమావేశం జరగవలసి ఉంది. దీనిని తక్షణమే నిర్వహించాలని, కమిటీలో నిర్ణయించిన పునరావాస కార్యక్రమాలను మరియు ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలను సింగరేణి సంస్థ చేపడుతుందని వివరించారు. దీనికి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. నైనీ బొగ్గు బ్లాక్ కు మొత్తం 912.79 హెక్టార్ల భూమి అవసరమైనప్పటికీ దీనిలో ప్రభుత్వ భూమి కేవలం 17.69 హెక్టార్లు మాత్రమే. ఈ భూమిని కూడా తక్షణమే సింగరేణి సంస్థకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి అయ్యే బొగ్గును అతి సమీపంలో ఉన్న జరపడ అనే రైల్వే సైడింగ్ ద్వారా రవాణా చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. దీనికి సంబంధించి రవాణా కాంట్రాక్టు కూడా ఖరారు చేసింది.

అయితే నైనీ బొగ్గు బ్లాక్ కు పక్కనే ఉన్న చండీ పడ అనే గ్రామం నుండి జరపడ సైడిరగ్ వరకు ఉన్న ఇరుకు ఆర్ అండ్ బి రోడ్డును విస్తరణ జరిపి మరియు బలోపేతం చేపట్టవలసి ఉంది. దీనికి సంబంధించి సంస్థ ఇప్పటికే 35.23 కోట్ల రూపాయలను ఆర్ అండ్ బి శాఖకు చెల్లించింది.అయిన పనులు ప్రారంభం కాలేదు. కనుక ఈ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోరారు. దీనికి కూడా ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నైనీ బొగ్గు బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి జరగాలంటే హై టెన్షన్ విద్యుత్ అవసరం ఉంది. దీనికి సంబంధించి జరపడ నుండి చండి పడ వరకు హై టెన్షన్ విద్యుత్తు లైను నిర్మాణం కోసం సింగరేణి సంస్థ ఇప్పటికే 9.35 కోట్ల రూపాయలను 2022 సంవత్సరంలోనే చెల్లించి ఉంది. ఈ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కనుక వెంటనే ఈ విద్యుత్తు లైను నిర్మించి ఇవ్వాలని కోరారు.

1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కర్మాగార ఏర్పాటుకు సహకరించండి…

నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి అవుతున్న బొగ్గును సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాలన్న నిబంధన ఉన్న కారణంగా నైనీ బ్లాకుకు సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600(2×800) మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన స్థల కేటాయింపు మరియు ఇతర అనుమతులు కూడా మంజూరు చేయాలని ఇదే సమావేశంలో శ్రీ భట్టి విక్రమార్క కోరగా దానికి కూడా ఒడిశా ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారు. పై అంశాలపై ఒడిశా ముఖ్యమంత్రి అక్కడే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర శాఖల ఉన్నతాధికారులను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖా ఓ.యస్.డి సురేందర్ రెడ్డి సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్, ఎన్ వి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News