Thursday, December 26, 2024

నేటి కేంద్ర హోం శాఖ అఖిల పక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరుగనున్న అఖిల పక్ష సమావేశానికి బిఆర్‌ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు వినోద్ కుమార్ బిఆర్‌ఎస్ తరఫున న్యూఢిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశంలో తన వంతు పాత్ర పోషించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News