Monday, January 20, 2025

అమిత్ షాపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్నికలు వస్తున్నాయనే కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందాలనే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి మాటలనే బిజెపి చెబుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే కడుపుమంటతో వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ముష్టి వేసినట్లు నిధులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్ తో మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అన్నారు.

అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే కేంద్రం తమకు నిధులు ఇస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయాలని నాలుగేళ్లుగా అడుగుతున్నాం.. మాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News