- Advertisement -
వనపర్తి ప్రతినిధి : హైదరాబాద్‌లో గొర్రెలను అమ్ముకుని తిరిగివస్తున్న క్రమంలో షాద్‌నగర్ అనూస్ జంక్షన్ వద్ద వాహనం అదుపు తప్పి లారీని ఢీకొని ముగ్గురు చనిపోయిన సంఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా పానుగల్ మండలం మందాపూర్‌కు చెందిన బొలెరో డ్రైవర్ అశోక్, తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన శంకర్, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నార్యా నాయక్‌కు చెందిన రవిలు ఈ ప్రమాదంలో మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతులు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
- Advertisement -