Thursday, December 26, 2024

ఆరు నెలల్లో హెల్త్ హబ్‌గా వరంగల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట:రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత వ రంగల్ ప్రధాన నగరమని, ఆరు నెలల్లో  జిల్లా కేంద్రాన్ని హెల్త్ హబ్‌గా మారుస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అ న్నారు. నర్సంపేటలో రూ.183 కోట్ల నిర్మించిన ప్రభుత్వ జిల్లా ఆసుప త్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలను స్థానిక ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, మ హబూబాబాద్ ఎంపి పోరిక బలరాంనాయక్‌తో కలిసి ఆయన గురువా రం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. బ్రెయిన్ ట్రాన్స్‌లేషన్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఐవిఎఫ్, ట్రామా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ల కోసం హైదరాబాద్ త దితర ప్రాంతాలకు జిల్లా ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో వరంగల్‌ను హెల్త్ హబ్‌గా చేయడమే తమ ప్రభుత్వ లక్షమని తెలిపారు. రాష్ట్రంలో వైద్య, వైద్యం అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అదే తరహాలో వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రు ల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ రెం డు రంగాలకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కళాశాలలు

మంజూరు చేశామన్నారు. నర్సంపేటలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారా మెడికల్ కళాశాల ఏర్పాటవుతుందని అన్నారు. ప్రతి గ్రా మంలో నర్సులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలనే ఆలోచనలో ప్ర భుత్వం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ పోస్టుల భర్తీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిని గతంలో పట్టించుకునేవారే లేరని, ఇప్పుడు తమ ప్రభుత్వం వందల కోట్ల నిధులతో ప్రకటించినట్లు తెలిపారు. 60 ఏళ్లు సుదీర్ఘ తెలంగాణ పోరాటం త రువాత రాష్ట్రం సాధించుకున్నామని, అయినా ప్రజలకు జాతీయ పార్టీకి కాకుండా ప్రాంతీయ పార్టీకి అధికారం ఇస్తే వారు ప్రజలను నట్టేట ముంచారని గత ప్రభుత్వం తీరును ఎండగట్టారు. కొందరు ప్రకటనలు, హామీలు, ట్విట్టర్, వాట్సప్, సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారని బిఆర్‌ఎస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను దశల వారీగా అమలు చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి అమలు ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీలతో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 657 కోట్లతో పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించామన్నారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కోసం 25 ఎకరాల్లో పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. నర్సంపేట నియోజకవర్గం లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మంచినీటి పేరుతో మిషన్ భగీరథ స్కీం తీసుకొచ్చి కోట్లాది రూపాయల నిధులను వారి ఖజానాలోకి మల్చుకుందని ఆరోపించారు. సుమారు రూ.46 వేల కోట్ల ఖర్చు చేశామని బిఆర్‌ఎస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందుతుం దా అని సర్వే చేయగా కేవలం 53 శాతం మంది ప్రజలకు మాత్రమే నీ రు అందుతున్నట్లు తేలిందన్నారు. అర్హులైన రైతులందరికీ రూ. రెండు లక్షల రుణమాఫి వర్తింపజేస్తామని, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ జాప్యం జరుగుతుందని, ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని, ఇంకా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే నెలలో తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇటీవల వర్షాల వల్ల ఆ పథకాన్ని ప్రారంభించలేదని, రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పేద ప్రజలు మగ్గులు పోసుకోవచ్చన్నారు. కొన్ని పథకాలపై ప్రతిపక్ష పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణ యం వల్ల వరంగల్‌లో సెంట్రల్ జైలు లేకుండా పోయిందని.. ఇరుకైన ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారని.. ప్రస్తుతం నర్సంపేట లాం టి సువిశాల ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. గత పాలకులు తీసుకున్న అనాలోచన నిర్ణయాల వల్ల ప్రజలపై పెనుభారం పడిందన్నారు. నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి, వైద్య, విద్యను ఈ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకరావడమే లక్షంగా మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద సహకారంతో ఆసుపత్రి పూర్తి అయిందని తెలిపారు. మెడికల్ కాలేజీలో అవసరమైన ఫ్యాక ల్టీ, వసతులను కల్పించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News