Monday, December 23, 2024

నీట్ పరీక్షల్లో అవకతవకలపై కేంద్రం సీరియస్

- Advertisement -
- Advertisement -

నీట్ పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం స్పందించారు. పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సుప్రీం కోర్టు సిఫారసు మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చామన్నారు. రెండు ప్రాంతాల్లో అవకతవకలు వెలుగు చేశాయని ఈ విషయం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని , విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తాను భరోసా ఇస్తున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ పనితీరును చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ఎన్‌టీఏ ఉన్నతాధికారులు దోషులుగా తేలినప్పటికీ వారిని సైతం విడిచిపెట్టేది లేదని చెప్పారు. జూన్ 4న నీట్ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిందని, పలుచోట్ల అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్ కోసం పరీక్షలు రాసిన 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం, ఎన్‌టీఏ గత గురువారం విన్నవించాయి. నీట్ పరీక్షలో అవకతవకలపై ఇప్పటికే కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News