- Advertisement -
హైదరాబాద్ : అమెరికా వర్జినియాలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఐ మిత్రులకు శుభాకాంక్షలను మంత్రి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ వేడుకల్లో మంత్రి కుటుంబ సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, అభిమానులు, బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ నాయకులు తానా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -