Thursday, January 23, 2025

పోలీసు అమరవీరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నివాళులు

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar pays tribute to police martyrs

హైదరాబాద్: వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పోలీస్ అమర వీరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కొందరు పోలీస్ అమర వీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులర్పించామన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీస్ లే అని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ వృత్తి అనేక వత్తిడిలతో కూడుకున్నది. పోలీసులు తమ వృత్తి ధర్మం కోసం, కుటుంబాలను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కొందరు కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అలాంటి వారి త్యాగాలు గొప్పవి. వారి కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అన్నారు. నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపి తరుణ్ జోషి వివిధ స్థాయిల పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News