Thursday, January 23, 2025

మునుగోడులో మంత్రి ఎర్రబెల్లి ఇంటింటి ప్రచారం

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Campaign In Munugode

నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికలో భాగంగా చండూరు 2, 3వ వార్డులలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ రోజు ప్రజలపనుల్లో మంత్రి భాగస్వాములు అయ్యారు. ఒక్కో ఓటరుతో మాట్లాడుతూ వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టిఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ప్రజలతో ఏర్పాటు చేసిన వేర్వేరు సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News