Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో భారతావనికే తలమానికం!

- Advertisement -
- Advertisement -

సబ్బండ ప్రజలకు కొండంత అండ!
తెలంగాణలో కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం
రాష్ట్రంలో కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం

హైదరాబాద్: రాష్ట్ర సంక్షేమంలో సిఎం కెసిఆర్ పాలన స్వర్ణయుగమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవని ఆదివారం ప్రగతిభవన్‌లో విడుదల చేసిన బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో భారతావనికే తలమానికంగా ఉందని ప్రశంసించారు.

రాష్ట్రంలో కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం అని తేలిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. అద్భుతంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉందని అలాగే ప్రజలకు కొండంత అండగా బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. తాజా మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తామని సిఎం కెసిఆర్ ఘంటాపథంగా చెప్పడం మంచి విషయం అన్నారు. పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయన్నారు. ప్రజలంతా మరోసారి ఆలోచించి ఓటేసి మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి, సిఎం కెసిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News